రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన శనివారం సాయంత్రం ఐయిజ మండలం వెంకటాపురం గ్రామ స్టేజి దగ్గర జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు యాపదిన్నెకి చెందిన దావీద్ గా గుర్తించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది