సమాజంలో పత్రికల పాత్ర కీలకమైనది: డీఎస్పీ రవి.
చార్మినార్ ఎక్స్ ప్రెస్ తెలుగు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ
సమాజంలో పత్రికల పాత్ర కీలకమైనదని డిఎస్పి జి. రవి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో డిఎస్పి కార్యాలయంలో చార్మినార్ ఎక్స్ ప్రెస్ తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను డీఎస్పీ జి.రవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి చార్మినార్ ఎక్స్ ప్రెస్ తెలుగు దినపత్రికవిలువలతో కూడిన వార్తలతో సమాజానికి దిశా నిర్దేశం చేస్తుందన్నారు సమాజంలో పత్రికల పాత్ర కీలకమైనదని, వీటికి స్వేచ్ఛ ముఖ్యమన్నారు. పత్రికలో పనిచేసే జర్నలిస్టులకు పత్రికలకు కూడా స్వేచ్ఛ ఉండాలన్నారు. ఎవరికి భయపడకుండా నిర్భయంగా నిస్సంకోచoగా వార్తలు రాసి నిజ నిజాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం పాతికేయులపై ఉందన్నారు. ప్రభుత్వం, ప్రజలకు మధ్య వారధిగా పత్రికలను ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరవేయడంలో వాటి పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చార్మినార్ ఎక్స్ ప్రెస్ తెలుగు దినపత్రిక రిపోర్టర్ పిన్నెల్లి వెంకటేష్, టి యు డబ్ల్యూ జే ( హెచ్-143) ఎలక్ట్రానిక్ మీడియా సూర్యాపేట జిల్లా అధ్యక్షులు (ఎన్టీవీ రిపోర్టర్) పి.శ్యాంసుందర్ రెడ్డి, టీ న్యూస్ రిపోర్టర్ అమరగాని నాగేందర్,6 టీవీ రిపోర్టర్ సిహెచ్.లింగారెడ్డి, ఎస్.సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.