కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు కాంగ్రెస్ పార్టీ నిరసన.

కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు కాంగ్రెస్ పార్టీ నిరసన… నియోజక వర్గ ఇన్చార్జ్ ఆవులు రాజిరెడ్డి

 

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని టిపిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ పిలుపు మేరకు నర్సాపూర్ పట్టణంలో భారీ ధర్నా నిర్వహించారు. పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో నర్సాపూర్ చౌరస్తాలో జరిగిన ఈ నిరసనలో భారీగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి గారు మాట్లాడుతూ “తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోంది. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది. బీజేపీ ఎంపీలు ఇప్పటికైనా తెలంగాణకు గళమెత్తాలి!అని వ్యాఖ్యానించారు.

 

ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ , జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసిని రెడ్డి, ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment