మీర్ పేట్ హత్య కేసు: వెలుగులోకి కొత్త విషయాలు

మీర్ పేట్ హత్య కేసు: వెలుగులోకి కొత్త విషయాలు

 

తన భార్యను నరికి ముక్కలు చేసి హీటర్ సాయంతో ఉడికించిన గురుమూర్తి అనే వ్యక్తి 

మరో మహిళ మోజులో ఘాతుకం!

తొమ్మిది రోజుల తర్వాత పూర్తి స్థాయి ఆధారాలు సంపాదించిన పోలీసులు!

హైదరాబాదులోని మీర్ పేటలో గురుమూర్తి అనే వ్యక్తి తన భార్య మాధవిను ముక్కలుగా నరికి, హీటర్ సాయంతో ఉడికించిన వైనం ఇటీవల సంచలనం సృష్టించింది. మరో మహిళ మోజులో పడి అతడు భార్యను కిరాతకంగా హతమార్చినట్టు భావిస్తున్నారు. ఇప్పుడా కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. తొమ్మిది రోజుల తర్వాత పోలీసులు ఈ కేసులో పూర్తిస్థాయి ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. 

భార్యను చంపిన తర్వాత గురుమూర్తి… తన ఫ్రెండ్ కు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా టికెట్లు బుక్ చేసిన విషయం వెల్లడైంది. దాంతో, గురుమూర్తి స్నేహితుడ్ని పోలీసులు స్టేషన్ కు పిలిపించి హత్య విషయం ఆరా తీసినట్టు సమాచారం. 

ఇక, గురుమూర్తి భార్యను హత్య చేశాక ఎనిమిదిసార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు గుర్తించారు. బడంగ్ పేటలో ఉన్న సోదరితో కూడా ఫోన్ లో మాట్లాడినట్టు తెలిసింది. ఈ మేరకు అతడి కాల్ డేటా పరిశీలనలో వెల్లడైంది. డీఎన్ఏ రిపోర్టుతో పాటు, క్లూస్ టీమ్ నివేదిక కూడా వస్తే ఈ కేసు దర్యాప్తు మరింత వేగవంతం కానుంది.

బ్లూరేస్ టెక్నాలజీ ద్వారా డీఎన్ఏ సేకరించారు. ఇంట్లో ఉన్న వస్తువులనే హత్యకు ఆధారాలుగా చూపించాలని పోలీసులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా, ఓటీటీలో ఎంతో ప్రజాదరణ పొందిన ‘సూక్ష్మదర్శిని’ అనే సినిమా చూసి గురుమూర్తి ఈ హత్యకు ప్రణాళిక రచించినట్టు భావిస్తున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment