అలకనంద ‘కిడ్నీ రాకెట్’ ఘటన. పై మంత్రి దామోదర కీలక నిర్ణయం

అలకనంద ‘కిడ్నీ రాకెట్’ ఘటన. పై మంత్రి దామోదర కీలక నిర్ణయం

 

ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశాలు

దోషులకు చట్టప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్న మంత్రి

ఈ రాకెట్‌లో ఉన్న ప్రతి ఒక్కరినీ పట్టుకోవాలన్న మంత్రి

హైదరాబాద్‌లోని అలకనంద ఆసుపత్రిలో వెలుగు చూసిన ‘కిడ్నీ రాకెట్’ కేసును తెలంగాణ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు.

ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయిలో విచారణ జరపాలని, ఈ రాకెట్‌లో ఉన్న ప్రతి ఒక్కరినీ పట్టుకోవాలన్నారు. దోషులకు చట్టప్రకారం శిక్షపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. మరొకరు ఇలాంటి పని చేయాలంటేనే వణికిపోవాలన్నారు.

ఈ కేసులో పోలీసుల దర్యాఫ్తు కొనసాగుతోంది. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఆసుపత్రి చైర్మన్ సుమంత్, మరో వ్యక్తి గోపి సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సుమంత్, గోపిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

సరూర్‌నగర్‌లోని అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి దందా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇలాంటి వ్యవహారాలపై విచారణ కోసం కేసును సీఐడీకి అప్పగించింది

Join WhatsApp

Join Now

Leave a Comment