రామగిరి మండలం సెంటనరీ కాలనీ లోని ఐఎఫ్టీయు కార్యాలయంలో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర 7వ.మహాసభల వాల్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి రజిత మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో మహిళలపై దాడులు దౌర్జన్యాలు హత్యలు హత్యాకాండలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని వీటిని అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. ముఖ్యంగా పసిపాపల పైన ఆదివాసి దళిత, గిరిజన,బలహీన వర్గాల మహిళలపై దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోక పోవడం వలన తిరిగి పునరావృతం అవుతున్నాయి అని మహిళలపై వివక్షత దాడులకు దౌర్జన్యాలకు హత్యలకు వ్యతిరేకంగా శ్రీ పురుష సమానత్వం కై మహిళలందరూ ఐక్యంగా పోరాడవలసిన అవసరం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మ, లక్ష్మి,సావిత్రి, భాగ్య,తిరుమల,రాణీ,పుట్ట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి
Published On: August 26, 2024 7:34 am