కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కార్పొరేట్ ముంగిట్లో ముగ్గయి వెలిసింది అఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా కార్యదర్శి యాదగిరి

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కార్పొరేట్ ముంగిట్లో ముగ్గయి వెలిసింది అఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా కార్యదర్శి యాదగిరి 

 

 

 నరేంద్ర మోడీ నాయకత్వంలో గల బిజెపి కేంద్ర ప్రభుత్వం తరపున ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్ కార్పొరేట్ శక్తుల ముంగిట్లో ముగ్గయి వెలిసిందని అఖిలభారత ఐక్య రైతు సంఘం(ఎ ఐ యు కె స్ )జిల్లా ప్రధాన కార్యదర్శి బి యాదగిరి అన్నారు. బడుగు బలహీన వర్గాల, కార్మిక ముఖ్యంగా పేద మధ్యతరగతి రైతులకు వ్యతిరేకమైనదని అన్నారు. దేశ రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ వారు పెట్టిన పెట్టుబడులు రాక రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటుందన్నారు. వ్యవసాయ రంగాన్ని వదిలి ఇతర రంగాలపై ఆధారపడుటకు దేశంలో రైతాంగం ప్రయత్నిస్తుందని చాలామంది రైతులు వ్యవసాయం గిట్టక పట్టణాలకు నగరాలకు వెళ్లి నిర్మాణ రంగంలో పని చేస్తున్నారన్నారు ఇది ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి అన్నారు. ప్రభుత్వం కార్పొరేట్లకు వడ్డీ రాయితీలు రుణమాఫీలు అందిస్తూ దేశానికి అన్నం పెట్టే రైతుకు సున్నం పెడుతుందన్నారు. దేశానికి వెన్నెముక రైతు అంటూ రైతే రాజు అంటూ రైతులను కొటేషన్లకే వాడుకుంటూ వారిని సంక్షోభం నుండి గట్టెక్కించే ప్రయత్నం ఒకటి ఈ బడ్జెట్లో లేదన్నారు. సంవత్సరాల కొలది దేశ రైతాంగం తమ పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావటం లేదని రైతు పెట్టుబడి పై 50% కలిపి ధర నిర్ణయించాలని మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేయాలని దేశంలో 70% వ్యవసాయ ఆధారిత రంగాలపై ఆధారపడి జీవిస్తున్న సగటు జీవిని ఈ బడ్జెట్ లెక్కలోకే తీసుకోలేదు అన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రైతు తన పంట రుణం మూడు లక్షల నుండి 5 లక్షల వరకు పరిమితి పెంచినమని సంకలు గుద్దుకుంటూ సంబరపడుతుంది కానీ ఏ ఒక్క బ్యాంకు కూడా ఒక రైతుకు ఎంత భూమి ఉన్నా లక్ష 60 వేల కంటే ఎక్కువ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. రైతాంగాన్ని మభ్య పెట్టడం కోసం పచ్చి మోసపూరితమైన మాటలు చెప్తుందన్నారు. సేంద్రియ వ్యవసాయం పెంచాలని పేరుతో ఎరువులపై సబ్సిడీలు తగ్గించిందన్నారు. కూరగాయలు, పండ్లు, పూలు పండించే రైతులకు సబ్సిడీలు ఇచ్చి ఉత్పాదక శక్తిని పెంచుటకు ప్రయత్నమే లేదన్నారు. మౌలిక వసతులు ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల కల్పన, ఆధునిక వ్యవసాయ పరికరాల సబ్సిడీపై పంపిణీ, పాడి పరిశ్రమ బలోపేతం తదితర వ్యవసాయ పరిశ్రమలు, వ్యవసాయ రంగ ఆధారిత ఉత్పాదక శక్తిని పెంచే విధంగా ఈ బడ్జెట్ లేదన్నారు. పచ్చి రైతు వ్యతిరేక, బడుగు బలహీన వర్గాల వ్యతిరేక బడ్జెట్ కార్పొరేట్ల కొమ్ము కాస్తూ వారి అనుకూలమైన బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడాన్ని అఖిలభారత ఐక్య రైతు సంఘం( ఏఐ యుకేఎస్ ) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. బడ్జెట్ను పూన పరిశీలించి దేశ రైతాంగానికి గిట్టుబాటు ధరలు కల్పించి వ్యవసాయ సంక్షోభం నుండి రైతాంగం బయటపడే విధంగా బడ్జెట్ను రూపొందించాలని లేనియెడల దేశాల రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించడం అఖిలభారత ఐక్యరైతుసంఘంజిల్లాకార్యదర్శియాదగిరిజరిగిందన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment