ముఖేష్ చంద్రకర్ హత్యకు టి‌.యూ.డబ్ల్యూ.జె హెచ్-143 ఖండన..

ముఖేష్ చంద్రకర్ హత్యకు టి‌.యూ.డబ్ల్యూ.జె హెచ్-143
ఖండన……….,,

 

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్ కు చెందిన ఎన్‌డిటివి జర్నలిస్ట్ గా పనిచేసిన ముఖేష్ చంద్రకర్ హత్యను టియూడబ్ల్యుజే హెచ్-143 జిల్లా అధ్యక్షులు వజ్జెవీరయ్య ఆదివారం ఒక ప్రకటన లో తీవ్రంగా ఖండించారు.

ముఖేష్ చంద్రకర్ మృతికి సంతాపం
తెలిపారు
బీజాపూర్ కు చెందిన యువ, అంకితభావం కలిగిన జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ హత్య చాలా బాధాకరం, హృదయ విదారకంగా ఉంది. ముఖేష్ నిష్క్రమణ జర్నలిజం వర్గాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది, సమాజానికి తీరని లోటు. ఈ హత్య హేయమైనదని, పిరికిపంద చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖేష్ నడిపే “బస్తర్ జంక్షన్” అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా బస్తర్ ప్రాంతంలోని సమస్యలను వెలికి తీసే క్రమంలో జరుగుతున్న అవినీతిపై అనేక కథనాలను వెలుగులోకి తేవడంతో.. అవినీతిపరులైన కాంట్రాక్టర్లు ముఖేష్ ను హత్య చేశారని, ప్రజాస్వామిక దేశంలో ఇలాంటి హత్యలను తీవ్రంగా ఖండించాలని కోరారు. జర్నలిస్టులకు ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని, ఈ దుర్ఘటనకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా

Join WhatsApp

Join Now

Leave a Comment