ఆస్పత్రిలో నెలకొన్న డాక్టర్ల కొరతను నివారించాలి
బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతాయా
తుంగతుర్తినియోజకవర్గ కేంద్రంలోని వంద పడకల ఆస్పత్రిలో నెలకొన్న డాక్టర్ల కొరత నివారించాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాడికొండ సీతయ్య డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం వైద్య విధాన పరిషత్ పరిధిలో మంజూరు చేసిన వంద పడకల ఆస్పత్రిలో డాక్టర్లు లేకపోవడం వలన రోజు ఆసుపత్రికి వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్లను జిల్లా వైద్యాధికారులు ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం వలన డాక్టర్ల కొరత ఏర్పడిందన్నారు వైద్య విధాన పరిషత్ ద్వారా డాక్టర్లు రాలేదనే సాకుతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన డాక్టర్లను ఇక్కడి నుంచి బదిలీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్, వైద్యాధికారులు వెంటనే స్పందించి బదిలీ చేసిన డాక్టర్లను తుంగతుర్తి ఆస్పత్రిలోనే విధులు నిర్వర్తించే విధంగా నియమించాలని, ఎంపీ నిధులతో ఎంపీ నిధులతో ఇచ్చిన అంబులెన్స్ ను నిరుపయోగంగా వదిలిపెట్టడం వలన రోగులకు అసౌకర్యం కలుగుతుందని వెంటనే అంబులెన్స్ ను వినియోగంలోకి తేవాలని ఆస్పత్రిలో మందుల కొరతను నివారించాలన్నారు అదేవిధంగా అసంపూర్తిగా మధ్యలో ఆగిపోయిన వంద పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను వెంటనే వేగవంతం చేసేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు మండల పరిధిలోని రావులపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు పనిచేస్తున్న వారిని తుంగతుర్తి ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రజలకు వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్ గొపగాని శ్రీనివాస్ గౌడ్ గోపగాని వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.