గుండాల హై స్కూల్ లోని పూర్వ విద్యార్థుల సమక్షంలో విశ్రమ ఉపాధ్యాయునికి ఘన సన్మానం

గుండాల హై స్కూల్ లోని పూర్వ విద్యార్థుల సమక్షంలో విశ్రమ ఉపాధ్యాయునికి ఘన సన్మానం

 

గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ పాఠశాలలో పనిచేసిన ఇటీవలనే పదవి విరమణ పొందిన విశ్రమ ఉపాధ్యా యుడు నహీం మహమ్మద్ కు పూర్వ విద్యార్థుల సమక్షంలో పూర్వ విద్యార్థి ఈరసరపు యాదగిరి గౌడ్ అధ్యక్షతన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఈ సమావేశానికి మాజీ మండల విద్యాధికారి గార్లపాటి సోమిరెడ్డి హాజరై మాట్లాడుతూ గుండాల ఉన్నత పాఠశాలలో 16 సంవత్సరాల పని చేసి బదిలీపై వెళ్లిన నయీమ్ మహమ్మద్ ఇటీవల పదవి విరమణ పొందిన సందర్భంగా గుండాల పూర్వ విద్యార్థులు ఈ పాఠశాలలో అభినందన సభ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం అని అన్నారు ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల తర్వాత వారి భవిష్యత్తును తీర్చిదిద్దగలిగేది ఉపాధ్యాయులేనని ఉపాధ్యాయులను ఈ విధంగా సన్మానించడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు 16 సంవత్సరాలు గుండాల పాఠశాలలో పనిచేసి ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన వ్యక్తి వారు ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్న వారు ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నామని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి పాఠశాలలో పెట్టి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు ఎంతో గర్వంగా ఉంటుందని ఇలాంటి కార్యక్రమం చేసినందుకు ప్రతి విద్యార్థిని అభినందిస్తున్నాను అన్నారు ఈ సందర్భంగా నహీం మహమ్మద్ 16 సంవత్సరాలుగా గుండాల పాఠశాలలో పనిచేసి నందున పూర్వ విద్యార్థులు బ్యాచు లవారీగా పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి అగ్గి రాములు గోపాల్ రెడ్డి సంజీవరెడ్డి వెంకట చలం నరేందర్ నరసింహారెడ్డి పరమేష్ బిక్షం మన్నే అంజయ్య యండి ఖలీల్ భిక్షం షర్బద్దీన్ ఐలయ్య దశరథ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment