రైతు భరోసా దరఖాస్తుల స్వీకరణ
సకాలంలో అందించాలి ఎంఏఓ శ్రీనివాస్ రెడ్డి
వట్పల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాలలో గత సంవత్సరం నుంచి కొత్తగా పాసుపుస్తకాలు పొందిన రైతుల నుండి ఏఈఓ లు రైతు భరోసా పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారాని మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పథకాన్ని కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులందరూ జనవరి 31వ తేదీలోగా సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులకు సంప్రదించి దరఖాస్తు ఫారం తో పాటు పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ మొదటి పేజీలను జత చేసి ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ కళ్యాణ్ మరియు రైతులు ఉన్నారు.