అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

 

 ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

 

 గుండాల మండలంలోని ప్రజాపాలన గ్రామ సభ లో పాల్గొని మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు,రేషన్ కార్డులు,రైతు భరోసా,ఆత్మీయ భరోసా పథకాలు,ప్రతి అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వాలనే ఉదేశ్యం తో ఈ ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించడం జరిగిందన్నారు.గ్రామ సభలో లబ్ధిదారులను ఎంపిక చేసి అదేవిధంగా ఇంకా ఎవరైనా నిజమైన లబ్ధిదారులు ఉండి ఎంపిక కాకపోతే మళ్ళీ పేర్లు నమోదు చేసుకొనే అవకాశం కల్పించడం కోసమే ఈ గ్రామ సభనునిర్వహిస్తున్నామన్నరు.మొదటి దశలో సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఐదులక్షలతోకట్టిస్తామన్నరు.ఈ నాలుగు రోజులపాటు జరిగే ప్రజాపాలనగ్రామసభలలలో ఇంకా ఎవరైనా కొత్త రేషన్ కార్డుకి, ఇందిరమ్మ ఇండ్లకి దరఖాస్తు పెట్టుకుంటే వాటిని కూడా పరిశీలించిగుర్తిస్తామన్నారు.ఈ కార్యక్రమాలన్నీ నిరంతరంగా జరుగుతాయని అన్నారు.

జిల్లా కలెక్టర్ హనుమంత రావు మాట్లడుతూ ప్రజాపాలన దరఖాస్తులను పరిశీలించారు. లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని అన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు వంటి వివిధ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందించడం జరుగుతుందన్నారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందివ్వడమే ప్రభుత్వ ఉద్దేశం అని అన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రవేశ పెట్టడం జరిగింది. అర్హులైన వారికీ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పని చేసి, గుంట భూమి లేని నిరుపేద కుటుంబాలకు రెండు విడతలుగా మొదట విడతలో 6 వేల రూపాయలు రెండో విడతల 6 వేల రూపాయలు, సంవత్సరానికి 12 వేలు ఈ పధకం ద్వారా సహాయం అందించడం జరుగుతుంది. లబ్ధిదారులకు రైతు భరోసా కింద వ్యవసాయ యోగ్యమైన భూమి ఎకరానికి 12 వేల రూపాయలు  

ఇవ్వడం జరుగుతుంది. దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు అనుగుణంగా అర్హులైన వారికి ఇల్లు ఇవ్వటం జరుగుతుందన్నారు. సంక్షేమ పథకాలు అమలు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందన్నారు.

ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తీ జెడ్పి సీఈవో శోభారాణి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, మండల తహసీల్దార్, మండల ప్రత్యేక అధికారి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment