కలెక్టరేట్ కార్యాలయం  ముందు జరిగే ధర్నా విజయవంతం చేయాలి

కలెక్టరేట్ కార్యాలయం  ముందు జరిగే ధర్నా విజయవంతం చేయాలి

 

 కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బత్తిని బిక్షం గౌడ్

 

 

కల్లు గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈనెల 20న జరిగే ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు బత్తిని భిక్షం గౌడ్ అన్నారు.శనివారం మండల కేంద్రంలోని విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కల్లుగీత కార్మికులు వృత్తిని చేస్తూ ప్రమాదవశాత్తు ఈత తాటి చెట్టు పై నుండి పడి ప్రమాదానికి గురైన కార్మికులకు వెంటనే ప్రభుత్వం ఎక్స్గ్రేషన్ అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈనెల 20న జరిగే ధర్నాను కల్లుగీత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment