జిల్లాలో పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు దిశగా సంబంధిత ఉపాధ్యాయులు కృషిచేయాలి
.. ..కలెక్టర్
— విద్యార్థులలో ఆలోచన శక్తి, సృజనాత్మకత పెంచే విధంగా
ఉత్తమ బోధన జరగాలి
— విద్యార్థులు డ్రాప్ అవుట్ కాకుండా చర్యలు చేపట్టాలి
— పదవ తరగతి ఉత్తమ ఫలితాలపై ప్రత్యేక అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ తో కలెక్టర్ సమీక్ష
….. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
జిల్లాలో పదవ తరగతి ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా సంబంధిత ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో పదవ తరగతి
పరీక్షలు నిర్వహణ , ఉత్తమ ఫలితాలు సంబంధిత అంశాలపై జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ప్రత్యేక అధికారులు,ప్రిన్సిపల్,ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులందరు ఇచ్చిన ప్రొఫార్మాను నింపాలని, పరీక్షలలో ఫెయిల్ అయ్యే విద్యార్థులను గుర్తించి వారు ఏమే అంశాలలో వెనకబడ్డారో తెలుసుకుని వాటిలో ఉత్తీర్ణత పొందే విధంగా వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రత్యేక తరగతుల ద్వారా విద్యాబోధన జరగాలన్నారు10 వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరిని కళాశాలలో చేర్పించే బాధ్యత ప్రధానోపాధ్యాయులు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితులలో కూడా వారినీ డ్రాప్ అవుట్ కాకుండాచూడాలనితెలిపారు.ప్రభుత్వపాఠశాలల్లో నిరుపేద విద్యార్థులు చదువుతారు, పాఠశాలల్లో మౌలిఖవసతులు పెంచేవిధంగా ప్రయత్నిస్తున్నామని, పిల్లలకు కాన్సెప్ట్ అర్థమయ్యే విధంగా బోధించాలని, విద్యార్థులలో ఆలవచనశక్తి, సృజనాత్మకత పెంచే విధంగా బోధించాలని తెలిపారు.జిల్లాలో పాఠశాలకు వెళ్ళని పిల్లలను గుర్తించే సర్వేను అందరూకాంప్లెక్స్(ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించి బడిబయట పిల్లల వివరాలు సేకరించి వారిని పాఠశాలలో చేర్పించాలని, చెప్పారు. పిల్లలు ఉచిత నిర్బంధ విద్య హక్కు చట్టం పగడ్బందీగా అమలు జరగాలని చెప్పారు.
గ్రౌండ్ బేస్ లెర్నింగ్ అన్ని పాఠశాలలో అమలు జరగాలన్నారు జిల్లాలోని 96 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించడంతోపాటు
ప్రధానీపాధ్యాయులందరు ఎస్ ఎస్ సి మార్చి-2025 పరిక్షలలో 98.5% ఉత్తీర్ణత సాధిస్తామని కలెక్టర్కు హామీ ఇచ్చారు.జిల్లాలలోని 739 మంది విద్యార్థులు 10 జిపిఏ సాదిస్తామని తెలిపారు .
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, అకాడమిక్ మానిటరింగ్ అధికారి జిల్లాలోని జిల్లా పరిషత్, ప్రభుత్వ, కే జీ వి బి, టి ఎస్ ఎం ఎస్ అన్నిరకాల రెసిడెన్షియల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు) (ప్రెస్సిపల్/ స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.