తెలంగాణ ప్రభుత్వంజిల్లా యువజన మరియు క్రీడల శాఖ, నారాయణపేట జిల్లా
రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీసెస్ క్రీడలలో పాల్గోనేందుకు సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల నుండి దరఖాస్తులు కోరుట గురించి.ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ కోసం రాష్ట్ర స్థాయి పోటీలు 23-01-2025 నుండి 24-01-2025 తేదీలలో ఎల్.బి స్టేడియం, హైదారాబాద్, జిమ్ ఖాన గ్రౌండ్, సికింద్రాబాద్ మరియు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం, హైదారాబాద్ నందు నిర్వహించబడునని నారాయణపేట జిల్లా యువజన మరియు క్రీడల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీసెస్ క్రీడల్లో పాల్గోనేందుకు నారాయణపేట్ జిల్లా నుండి అసక్తి గల ప్రభుత్వ ఉద్యోగస్తులు తేది. 21-01-2025 వరకు జిల్లా యువజన మరియ క్రీడల శాఖ, జిల్లా స్టేడయం గ్రౌండ్, నారాయణపేట జిల్లా నందు తమ ఉద్యోగ గుర్తింపు కార్డుతో పాటు ఆధార్ కార్డు తీసుకోని తమ పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు.
క్రీడా అంశములుః
1) అథ్లేటిక్స్(M&W), 2) క్రికెట్, 3) చెస్(M&W), 4) క్యారమ్స్(M&W) 5) హాకీ(M&W), 6) పవర్ లిఫ్టింగ్(M&W), 7) స్విమ్మింగ్(M&W), 8) టేబుల్ టెన్నీస్(M&W), 9) వాలీబాల్(M&W), 10) వెయిట్ లిఫ్టింగ్(M&W), 11) రెజ్లింగ్ & గ్రీకో రోమన్, 12) బెస్ట్ ఫిసిక్, 13) ఖో ఖో, 14) యోగ మీ విశ్వసనీయులుతేదీ:19-01-2025 జిల్లా యువజన మరియు క్రీడల అధికారి(FAC) నారాయణపేట జిల్లా