సువెన్ ఫార్మా కంపెనీని జనావాసాలకు దూరంగా తరలించాలి

సువెన్ ఫార్మా కంపెనీని జనావాసాలకు దూరంగా తరలించాలి

 

      కొత్తపల్లి శివకుమార్ సీపీఐ(ఎం.ఎల్)మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి

 

 

సూర్యాపేట పట్టణంలోని శాంతినగర్ లో ఉన్నటువంటి సువెన్ ఫార్మా కంపెనీని వెంటనే అక్కడ నుండి జనావాసాల దూరంగా తరలించాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ డిమాండ్ చేశారు. ఈరోజు సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సువెన్ ఫార్మా కంపెనీని జనావాసాలకు దూరంగా తరలించాలని లేదా కంపెనీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఏఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కామ్రేడ్ సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ సువెన్ ఫార్మా కంపెనీ 30 సంవత్సరాల క్రితం దొంగ అనుమతి పత్రాలతో కంపెనీని స్థాపించి,అక్రమంగా ఫ్యాక్టరీని నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది జనావాసాల మధ్య ఉండటం వలన ప్రజలకు ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె జబ్బులు, లివర్ సంబంధించిన క్యాన్సర్, మెదడుకు సంబంధించిన జబ్బులు రావడం వలన వందలాది మంది రోగగ్రస్తులు అయ్యారని ఆవేదన చెందారు. పదుల సంఖ్యలో మరణాలు కూడా సంభవించాయని ఆయన ఆరోపించారు. ఈ సువెన్ ఫార్మా కంపెనీ వలన జల కాలుష్యం, వాయు కాలుష్యం, భూమి కూడా కాలుష్యం చెందుతుందని అన్నారు. జల కాలుష్యం వలన ఇక్కడ చెరువులలోని,కుంటలలోని చేపలను ప్రజలు తినలేక పోతున్నారని ఆవేదన చెందారు. భూమి పశుగ్రాసం కాలుష్యమై వందలాది పశువులు మరణించాయని అన్నారు.ఈ కంపెనీ యాజమాన్యం ప్రభుత్వ భూమిలో ఉన్న కాలువను కబ్జా చేశారని ఆరోపించారు. ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించిన సెవెన్ ఫార్మా కంపెనీ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రభుత్వాధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన ప్రయోజనం లేదని ఆవేదన చెందారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు మేలుకొని ఈ కంపెనీ సీజ్ చేయటం లేదా జనావాసాలకు దూరంగా తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరినారు. అలా చేయని యెడల మా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కంపెనీని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ సూర్యాపేట డివిజన్ కమిటీ కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పేర్ల నాగయ్య, టియుసిఐ జిల్లా అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు ఎస్కే సయ్యద్,పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు మారసాని చంద్రకళ, సహయ కార్యదర్శి సంతోషి, కోశాధికారి జయమ్మ,పిడిఎస్యు జిల్లా నాయకులు విజయ్ రెడ్డి,శేషగిరి, మోహన్, కట్ట రమేష్, కట్ట కల్పన, విజయ్, గోగుల వీరబాబు, ఐతరాజు పద్మ,శంకర్, అరుణ, ఎల్లమ్మ ,పద్మ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment