రైతుభరోసా అమలులో భాగంగా సర్వే

రైతుభరోసా అమలులో భాగంగా సర్వే

 

రైతుభరోసా అమలులో భాగంగా వట్పల్లి మండల పరిధిలోని వట్పల్లి, ఖాదిరాబాద్ దేవనూర్, ఉసిరిక పల్లి, మర్వెల్లి రెవెన్యూ గ్రామాలలో సాగులో ఉన్న వ్యసాయ భూములను గుర్తించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నట్లు రాయికోడ్ డివిజన్ (ఏడిఏ) సత్యనారాయణ తెలిపారు. రైతు భరోసా కోసం ఇప్పటికే మార్గదర్శకాలు కూడా విడుదలయ్యాయి. అయితే సాగు యోగత్య లేని భూములకు సర్వే లో తేలనుంది. సాగు యోగ్యత ఉన్న వాటికే డబ్బులు అందుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈనెల 26 నుంచి రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రారంభిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా పేరిట ఆర్థికసాయాన్ని 12 వేలకు పెంచింది. ఈ పథకాన్ని సాగులో ఉన్న భూములకే వర్తింపచేయాలన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి సర్వేను సక్రమంగా నిర్వహించి సకాలంలో పూర్తి చేయాలని ఏఈఓ లకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఏ.వో .శ్రీనివాస్ రెడ్డి, ఏఈఓ లు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment