పారిశుద్ధ్య కార్మికులని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, మున్సిపల్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఏసు రత్నం
ఖమ్మం జిల్లా వైరా మున్సిపల్ పరిధిలో ఈరోజు తేదీ 18/01/ 2025 తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్టర్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో కార్మికుల సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఏసు రత్నం రాష్ట్ర సహాయ కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరైనారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యేసు రత్నం కార్మికుల ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు. మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి కార్మికులను పర్మినెంట్ చేసే అంతవరకు కనీస వేతనాలు 26 వేల రూపాయలు అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా మున్సిపల్ కార్మికులకు ప్రతి నెల ఒకటో తారీకు నాడు ట్రెజరీ ద్వారా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. కార్మికులపై పని భారాన్ని తగ్గించాలి బస్తీలు రోజు రోజుకు పెరుగుతున్నాయి కాలనీలకు అనుగుణంగా కార్మికులను కూడా పెంచాలని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు 60 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికునికి ఐదు లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి ఇంట్లో వారికి ఒకరికి ఉద్యోగం అవకాశం కల్పించాలన్నారు. ప్రతిరోజు కార్మికులకు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విధులు నిర్వహించే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. మున్సిపల్ కార్మికులకు ఇచ్చినట్లుగానే డైలీ వేజెస్ గా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కూడా జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలి కార్మికులకు కనీస వేతనాలు పెంచకుంటే ఫిబ్రవరి నెలలో పోరాటాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు, జిల్లా అధ్యక్షులు గాదే లక్ష్మీనారాయణ , జిల్లా ఉపాధ్యక్షులు గారపాటి అశోక్ , మున్సిపల్ యూనియన్ నాయకులు రాయపూడి శీను, పిడియాల లక్ష్మయ్య, స్వామి దాస్, తదితరులు పాల్గొన్నారు