జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ర్యాలీ
మండల కేంద్రమైన వట్పల్లి లో తహసిల్దార్ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. తహిసిల్దార్ కార్యాలయం నుంచి ప్రధాన రహదారి గుండా వట్పల్లి అంబెడ్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు విలువ, ప్రాముఖ్యత గురించి తెలుసుకొని ఎన్నికలలో ఓటును సద్వినియోగం చేసుకోవాలని తహసిల్దార్ అన్నారు. స్థానిక నాయకులు, యువకులు, ప్రజలతో మానవహారంగా ఏర్పడి ఓటరు నినాదాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శశి ప్రభ డిప్యూటీ తహిసిల్దార్ శంబీ రెడ్డి, ఎస్సై విటల్ ఉపాధ్యాయులు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకట్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దిగంబర్ రావు, సంగారెడ్డి యదగౌడ్ అంగన్వాడి టీచర్లు ఆ శాఖలవారు మరి గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు