పోతుగంటి వీరాచారి, తెలుగు కీర్తి జాతీయ ప్రతిభా పురస్కారానికి ఎంపిక

పోతుగంటి వీరాచారి

తెలుగు కీర్తి జాతీయ ప్రతిభా పురస్కారానికి ఎంపిక

 

సూర్యాపేట పట్టణానికి చెందిన కవి, రచయిత, సామాజిక కార్యకర్త, శ్రీ శ్రీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు డా. పోతుగంటి వీరాచారికి తెలుగు కీర్తి జాతీయ ప్రతిభా పురస్కారానికి ఎంపికైనారని అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్ ఒక ప్రకటనలో తెలిపారు. పోతుగంటి వీరాచారి తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు వైభవం, తెలుగు సాహిత్యం తెలుగు కళల పరిరక్షణ కోసం నిరంతరాయంగా సాహిత్య, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలలో, సాహిత్యరంగంలో విశేష కృషిగాను శ్రీశ్రీ కళావేదిక మరియు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్ , వరల్డ్ రైటర్స్ ఫోరం, వరల్డ్ పోయేట్రి అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 21 తేదీన విజయవాడలోని శ్రీ కౌత పూర్ణనంద్ విలాస్ కళావేదికలో జరిగే కార్యక్రమంలో పురస్కారం అందుకోనున్నారు, ఈ సందర్భంగా సాహితీవేత్త పోతుగంటి వీరాచారి మాట్లాడుతూ తనను ఎంపిక చేసిన శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ గ డా. కత్తిమండ ప్రతాప్ కి జాతీయకన్వీనర్ కొల్లి రమావతి కి జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం కి మరియు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. వీరా చారిని సాహితి మిత్రులు, లింగాల శ్రీనివాస్, ఎస్కే అమీద్ ఖాన్ జార్జ్ కుమార్, పూసోజు పద్మ తుమ్మ రాజా, శివరాత్రి వెంకన్న తదితరులు అభినందనలు తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment