నారాయణపేట జిల్లా ప్రజావాణిలో రాజ్యాధికార సాధన సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం
సోమవారం నారాయణపేట కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ శ్రీమతి సిక్త పట్నాయక్ ప్రజావాణిలో భాగంగా కలిసి దివ్యాంగులకు ఇందిరమ్మ ఇళ్లలో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని వికలాంగుల రాజ్యాధికార సాధన సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఇందుకుగాను కలెక్టర్ సానుకూలంగా స్పందించి మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది
ఈ సందర్భంగా వికలాంగుల రాజ్యాధికార సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు బిజ్వార్ నగేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 6 గ్యారంటీలలో భాగంగా ఈనెల 26 నుంచి అమలు కానున్న ఇందిరమ్మ ఇళ్లలో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఇది 2016 వికలాంగుల హక్కుల చట్టంలో ఉందని అదేవిధంగా రాష్ట్ర క్రోనిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా ఇందిరమ్మ ఇళ్లలో మొదటి ప్రాధాన్యత వికలాంగులకు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది కావున ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా ఐదు శాతం రిజర్వేషన్ కల్పించే విధంగా చూడాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది
ఇట్టి కార్యక్రమంలో అబ్దుల్ అజీజ్ ఖాన్ చిట్యాల ఆంజనేయులు రాఘవేందర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు