ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి  సువెన్ పరిసర ప్రజలకు సువెన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం: ఎం రమేష్ బాబు

ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి 

 

సువెన్ పరిసర ప్రజలకు సువెన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం: ఎం రమేష్ బాబు

 

 

నిరుపేదలు ఉచిత వైద్య శిభిరాలను సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలని సువెన్ ఫార్మ హెడ్

ఎం.రమేష్ బాబు అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భరోసా సెంటర్లో సువెన్ ఫార్మా ఆధ్వర్యంలో మెడికవర్ ఆసుపత్రి వైద్య బృందంచే ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిభిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సువెన్ పరిసర ప్రాంతాల ప్రజలు దూర ప్రాంతాల్లో ఉండే పెద్దసుపత్రులకు వెళ్ళే అవసరం లేకుండా అక్కడి ఆసుపత్రి వైద్యబృందంచే ఈ ఉచిత వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సువెన్ ఫార్మా ఆధ్వర్యంలో ప్రతి నెల ఇలాంటి ఉచిత వైద్య శిభిరాలను ఏర్పాటు చేసి అవసరమైన మందులు పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ శిభిరంలో గైనకాలజీ, ఆర్థోపెడిక్, కార్డియాలజీతో పాటు జనరల్ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ నీలాబాయి లింగానాయక్, సీఎస్ఆర్ ఇంచార్జి పి.ఎస్.ఎన్.మూర్తి, హెచ్ఆర్ హెడ్ వెంకటరమణ, మెయింటెనెన్స్ పి.జె.రైడ్, ఇహెచ్ఎస్ పి.వి.రమణ, ప్రొడక్షన్ ఎం.వి.రమణ, డివీఎస్, అడ్మినిస్ట్రేషన్ సైదులు, విజయచక్రునాయక్, జీవన్, శంకర్ నాయక్, శివరాంనాయక్, లింగానాయక్ తో పాటు సువెన్ హెచ్ఎడిలు, ఉద్యోగులు, పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment