నియోజకవర్గ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సునీత రెడ్డి
మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్థానిక నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు రైతులకు నాయకులకు ప్రజాప్రతినిధులకు కార్యకర్తలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పాడిపంటలతో, ప్రజలు సిరి సంపదలతో తులతూగాలని, హైదరాబాద్ నగరం నుండి గ్రామాల్లోకి వలస వెళ్లినటువంటి వారు రాకతో గ్రామాలు ఆడపడుచులతో చిన్నారులతో విద్యార్థినీ విద్యార్థులతో కలకల్లాడుతున్నాయని అలాగే పండుగ అనంతరం సుభిక్షంగా వారి వారి స్థానాలకు చేరుకోవాలని ఆమె తెలిపారు.