పారిశుధ్య కార్మికులకు కిట్‌ల పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ సనస సభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్‌తో కలిసి ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు.

పారిశుధ్య కార్మికులకు కిట్‌ల పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ సనస సభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్‌తో కలిసి ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు. 

 

మన పట్ల శ్రద్ధ వహించే వారి పట్ల శ్రద్ధ వహించండి అనే పేరుతో కంటోన్మెంట్ నియోజకవర్గం, న్యూ బోయిన్ పల్లి. పబ్లిక్ సెక్టార్ కాలనీ లో సికింద్రాబాద్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రసిడెంట్ సోహైల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పారిశుధ్యకార్మికులకు కిట్స్ పంపిణీ చేసే కార్యక్రమంలో తెలంగాణ శానససభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ గారితో కలిసి ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు.  

 

, ఈనాడు మన రోడ్లు, కాలనీలలోని పరిసరాలను శుభ్రంగా ఉన్నాయంటే అది పారిశుద్ధ్య కార్మికుల కృషే అన్నారు. పారిశుధ్య కార్మికులు వారి ఆరోగ్యాలను పణంగా పెట్టి సమాజం కోసం పనిచేస్తున్నారని అన్నారు. వారి కోసం సికింద్రాబాద్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రసిడెంట్ సోహైల్ ,స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కిట్స్ పంపిణీ చేయడం అభినందించదగ్గ విషయం అన్నారు. 

 

మానవ సేవే మాధవ సేవ అని, పారిశుధ్య కార్మికులు సమాజానికి చేస్తున్న సేవ వల్లే సమాజం ఆరోగ్యం గా ఉంటుందని, వారు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని అందుకోసమే పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం కాపాడుకోవడం అందరి బాధ్యత అని అందుకోసం కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యే గా తను కూడా ప్రతీ నెల వారి కోసం హెల్త్ క్యాంపు లు ఏర్పాటు చేస్తానని అన్నారు శ్రీగణేష్. ప్రభుత్వ పథకాలన్ని పారిశుధ్య కార్మికులకు అందేలా చూస్తానని అన్నారు.  

 

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలో ట్రెంచింగ్ లాండ్ ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అక్కడ పేదలకు ఇళ్లు కట్టించే ఏర్పాటు చేస్తానని కూడా ఎమ్మెల్యే హామి ఇచ్చారు. పారిశుధ్య కార్మికులకు ఎలాంటి సమస్య ఉన్నా, ప్రభుత్వం తరపున ఎలాంటి సహాయం కావాలన్నా తను క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటానని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment