ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి
వట్పల్లి మండలకేంద్రం లో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి భావన నిర్మాణ పనులను పరిశీలించిన ఆరోగ్య శాఖ దామోదర రాజనర్సింహ ఈ సందర్భంగా మాట్లాడుతూ సకాలం లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అక్కడే ఉన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ జోషీ, సీనియర్ నాయకులతో మాట్లాడుతూ మండలంలోని సమస్యలు పై సంక్షేమ పథకాలు తీరు పై చర్చించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా యువజన ప్రదాన కార్యదర్శి వినయ్ గౌడ్, యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకట్ రావు, మాజీ సర్పంచ్ సంగారెడ్డి, ఏ ఎం సి డైరెక్టర్ దిగంబర్ రావు, మాజీ ఎంపీటీసీ విట్ఠల్ , పెద్దన్న నాగరాజ్ వివిధ శాఖ అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.