ఎన్టిపిసి బూడిద తో నిత్యం పలు ప్రమాదాలు

ఎన్టిపిసి బూడిద తో నిత్యం పలు ప్రమాదాలు

 

బి ఆర్ ఎస్ పార్టీ పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్ 

 

 

ఎన్టిపిసి బూడిద తో వెళుతున్న ఓవర్ లోడ్ తో వెళ్తున్న లారీలతో నిత్యం పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ లారీలు కనీస నిబంధనలు పాటించకుండా, రోడ్డుపై ఓవర్ లోడుతో బూడిద తీసుకువెళుతుండడంతో, వేగంగా వెళుతున్న లారీలో ఉన్న బూడిద వెనకాల వెదజల్లుతూ వాహనదారులకు, అదే విధంగా రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఇంటి ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుంది. 

 

 

ఎన్ టి పి సి నుండి నిత్యం కరీంనగర్ జగిత్యాల వరంగల్ ఇలా అనేక పట్టణాలకు వందల లారీలలో ఈ బూడిదను ఓవర్ లోడ్ తో తీసుకు వెళుతూ ఉన్న, వాటిని అరికట్టాల్సిన అధికార యంత్రంగా మాత్రం చూసి చూడనట్లు ఉండడం ప్రజలకు శాపంగా మారింది. ఈ బూడిద గాలిలో విపరీతంగా చేరడంతో వాటిని శ్వాసగా పీల్చుకోవడం ద్వారా ప్రజలు అనారోగ్యం నకు గురికావాల్సి వస్తుంది. లారీలు వెనకాల వెళుతున్న వాహనదారులకు కూడా బూడిద రావడం ద్వారా ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

 

రోడ్డుపై కుప్పలుగా అక్కడక్కడా పడుతున్న బూడిద, దానిమీద వాహనాలు వెళ్లడంతో, ఒకేసారి దుమ్ముగా రోడ్డు పై ఆ బూడిద లేచి, ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యం అదేవిధంగా ప్రమాదాలకు నిలయంగా ఈ బూడిద లారీలనుండి వెదగళుతున్న బూడిద కారణమవుతుంది. ఇప్పటికైనా ఈ ఓవర్ లోడ్ తో వెళ్తున్న బూడిద లారీలకు పై రవాణా శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని బి ఆర్ ఎస్ పార్టీ పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్ కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment