వసంత పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం
హనుమకొండ జిల్లా భీమదేరుపల్లి మండలం ములకనూరు గ్రామంలో వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రంథాలయంలో సరస్వతి మాతకి ప్రముఖులు పూజలు చేశారు. ఆ తర్వాత ప్రముఖులచే పిల్లలకు అక్షరాభ్యాసం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామంలోని చిన్నపిల్లలను తమ తల్లిదండ్రులు నూతనవస్త్రాలు ధరించి సరస్వతి మాత పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజలో పాల్గొన్న పిల్లలకు నూతన పలక బల్పం, పెన్నులు బుక్కులు గ్రంథాలయం వారు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి వంగ రవీందర్, మాజీ సర్పంచ్ మాడుగుల కొమురయ్య, గొల్లపల్లి లక్ష్మయ్య, సరోజన, ఎదులపురం తిరుపతి, వీరేశం, ప్రమోద్ రెడ్డి, అశోక్ ముఖర్జీ, కొలుగూరి రాజు, కాసగోన్ భగత్ సింగ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.