వేదాంత భజన మందిరంలో చల్లా లక్ష్మికాంత్ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా కుడారై మహోత్సం
సూర్యాపేట పట్టణంలోని బొడ్రాయి బజార్ నందు గల వేదాంత భజన మందిరం నందు ప్రముఖ వ్యాపారవేత్త చల్లా లక్ష్మికాంత్ ఆధ్వర్యంలో ధనుర్మాసం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గోదాదేవిలకు నైవేద్యంగా వెన్నను సమర్పించే కుడారై మహోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా లక్ష్మికాంత్ శ్ర్రతి దంపతులు ఆలయంలో జరిగిన పూజలో పాల్గొని 108 కుడారై పాయసములను భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాచర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి వేదాంత భజన మందిరం నందు చల్లా లక్ష్మికాంత్ ఆధ్వర్యంలో భక్తులకు కుడారై పాయసం అందిస్తున్నారని, వారికి భగవంతుని ఆశీర్వాదం కలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి నకరకంటి నాగరాజు, కోశాధికారి సోమ అశోక్, పబ్లిక్ క్లబ్ ఇసి మెంబర్ రాచకొండ శ్రీనివాస్, వాసవి క్లబ్ జెడ్ సి చల్లా లక్ష్మయ్య, శీలా శంకర్, చిత్తలూరి శ్రీధర్, చల్లా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.