పేదవారిని ఆదుకోవడమే మనందరి విధి

పేదవారిని ఆదుకోవడమే మనందరి విధి

ప్రతి పేదవారిని ఆదుకోవడమే మనందరి విధి అని కమాన్ పూర్ లయన్ క్లబ్ అధ్యక్షుడు సానా రామకృష్ణారెడ్డి సత్య సాయి సేవ సమితి జిల్లా కన్వీనర్ నూక రమేష్ అన్నారు. ఆదివారం కమాన్ పూర్ మండల కేంద్రంతోపాటు తదితర ప్రాంతాల్లో లయన్స్  క్లబ్ మరియు సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు అమృత కళాశాలు అనగా బీదవారికి నెలసరి బియ్యం తదితర వస్తువులను నెల సామాగ్రి అందజేశారు. మొదటి ఆదివారం 16 మందికి నిత్యవసర సరుకులు అందజేయడం జరుగుతుంది. సుమారు 22 వేల రూపాయల విలువ గల నిత్యవసర వస్తువులు వేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పేదవాడు కడుపు ఆకలితో ఉండకుండా మా సాయి శక్తుల వారికి అందజేయడం జరుగుతుందని అన్నారు. అలాగే మరి కొంతమంది బీదవారికి సైతం అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
సత్య సాయి కన్వీనర్ నూక రమేష్, లైన్స్ క్లబ్ అధ్యక్షులు సాన రామకృష్ణారెడ్డి, లయన్ క్లబ్ ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి శంకర్, సదాశయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, బుగ్గజి, తాటిపాముల శ్రీనివాస్, కందికట్ల భాస్కర్, , లయన్ అనవేన లక్ష్మీరాజు, లయన్ జబ్బార్ ఖాన్ . తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment