బిజ్వార్ గ్రామంలో అక్రమంగా చెట్లు నరికివేత
నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలం బిజ్వార్ గ్రామంలో అక్రమంగా వేప తుమ్మ చెట్లు నరికి వేస్తున్నారు. తుమ్మ చెట్లను భారీ యంత్రాలతో కటింగ్ చేసి అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించినప్పటికి స్పందించలేదని గ్రామస్తులు వాపోతున్నారు. అక్రమ వేప తుమ్మచెట్ల నరికివేత పై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు
ఇదిలా ఉంటే పర్యావరణ కాలుష్యం పెరిగి అనేక రకాలుగా జనాలపై అనేక రోగాలు ప్రబల్లే ప్రమాదం ఉందని అలాగే ఎన్నో వాతావరణ శాఖలు చెబుతున్నప్పటికీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు మాత్రం నిమ్మకు నేరే తిన్నట్లుగా ఉన్నట్టు కనబడుతుందని ఇది చూస్తుంటే అర్థం అవుతుంది కాబట్టి నేటికైనా అధికారులు జిల్లాలో ఉండే ప్రతి గ్రామంలో కూడా ఏ చెట్లను నరకకుండా చూస్తూ నరికిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ పర్యావరణాన్ని రక్షించ వలసిందిగా అలాగే చెట్లను పెంచమని ఒక సైడు ప్రభుత్వ అధికారులు చెప్తుంటే నేడు అదంతా శూన్యంగా కనిపిస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు కాబట్టి నేటికైనా అడవులను రక్షించవలసిందిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పైన ఎంతైనా ఉందని గ్రామస్తులు కోరుతున్నారు కాబట్టి నేటికైనా చెట్లను నరికే వారిపై కఠినమైన చర్యలు తీసుకొని చెట్లను కాపాడుకుంటూ గ్రామాలలో నివసించే గ్రామ ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు