జిసిసి కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె ఉధృతం చేస్తాం.
సిఐటియు నాయకులు బండారు శరత్ బాబు.
4 వ రోజు సమ్మెను ప్రారంభించిన ప్రముఖ వ్యాపారవేత్త పల్లంటి దేశప్ప.
భద్రాచలం:జిసిసి కార్మికులు సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని సిఐటియు పట్టణ నాయకులు బండారు శరత్ బాబు హెచ్చరించారు. నాలుగో రోజు సమ్మె శిబిరాన్ని ప్రముఖ వ్యాపారవేత్త లయన్ పల్లంటి దేశప్ప పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సిఐటియు నాయకులు బండారు శరత్ బాబు మాట్లాడుతూ బిసిసి కార్మికుల ఎగుమతులు దిగుమతులు రేకుల కు సంబంధించిన ఒప్పందాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని అన్నారు. భద్రాచలం ఏజెన్సీలో గిరిజన సహకార సంస్థ ద్వారా సివిల్ సప్లై అందించు ధాన్యం అన్ని రేషన్ షాపులకు చేరవేసే కార్మికులకు చెల్లించాల్సిన ఎగుమతి దిగుమతి రేట్లు ఒప్పందం ప్రకారం ఇవ్వకుండా అధికారులు మేన మీసాలు లెక్కపెడుతున్నారని విమర్శించారు. తక్షణమే జిసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని, జీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా అన్ని రంగాల కార్మికులను కూడగడతామని హెచ్చరించారు. ప్రముఖ వ్యాపారవేత్త పల్లంటి దేశప్ప సమ్మెను ప్రారంభించి కార్మికులకు సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గడ్డం స్వామి నకిరేకంటి నాగరాజులు పాల్గొనగా, జిసిసి కార్మికులు ప్రసాదు, శేషు, లోకేష్, రామారావు, ముత్తయ్య, పాండు, మోహన్, రవి, వీర్రాజు తదితరులు దీక్షలో కూర్చున్నారు.