అయ్యప్పలో హైడ్ర కూల్చివేతలు

అయ్యప్పలో హైడ్ర కూల్చివేతలు

 

హైడ్రా అధికారుల దూకుడు మళ్ళీ మొదలయ్యింది ..హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పరంపరా కొనసాగుతోంది. ఆదివారం శేరిలింగంపల్లి మాదాపూర్ లో హైడ్రా అధికారులు ఓ అక్రమ నిర్మాణం పై చర్యలు చేపట్టారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మిస్తున్న ఐదంస్తుల బిల్డింగ్ నీ కూల్చేశారు అయ్యప్ప సొసైటీ వద్దకు హైడ్రా అధికారులు భారీగా పోలీసులతో మోహరింఛీ పోలీసుల భద్రత మధ్య హైడ్రా సిబ్బంది అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసింది, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైడ్రా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. కూల్చివేస్తున్న భవనం రోడ్డు పక్కనే ఉండటంతో పవర్ సప్లై ఆపేశారు. భవనాన్ని కూలుస్తున్న సమయంలో ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపి వేశారు. దీంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడ్డారు. నిబంధనలను పట్టించుకోకుండా అక్రమంగా నిర్మిస్తున్న ఏ నిర్మాణాన్నైనా కూల్చేస్తామని హైడ్రా అధికారులు ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. అయినా కూడా కొంతమంది వాటిని పెడ చెవిన పెడుతున్నారు. ఇప్పుడు అయ్యప్ప సొసైటీలో నిర్మించిన భవనం కూడా నిబంధనాలకి విరుద్ధంగా అతిక్రమించి కట్టినదే. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్, గ్రౌండ్ తో పాటూ 5 అంతస్తు భవనాన్ని నిర్మిస్తున్నారని అక్కడ స్థానికులు హైడ్రాకు పిర్యాదు చేయ్యాడం తో ఫిర్యాదుల మేరకు భవనాన్ని పరిశీలించిన అధికారులుఆదివారం అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలకు శ్రీకారం చుట్టింది.అయితే బిల్డర్ల ఒత్తిడికి హైడ్రా వెనకడుగు వేస్తుందా…లేక హైడ్రా ఇదే దుకుడుని ప్రదర్శిస్తుందా..లేక తూ..తూ..మంత్రంగా వ్యవహరిస్తుంద అన్న అనుమానాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. అంతే కాకుండా వందలాది ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చల విడిగా పదులకు మించిన అంతస్తుల భవనాలు నిర్మాణంలో ఉన్నాయి మరి వాటి సంగతి ఏంటి అని స్థానికంగా హైడ్రా ను ప్రశ్నిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment