జిల్లా ప్రజలందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు
–అదనపు కలెక్టర్ నగేష్
ఆ మహా శివుని ఆశీస్సులతో జిల్లాలో ప్రజలందరూ ఆయురా రోగ్యాలు అష్టైశ్వర్యాలతో తులతూగాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు సోమవారం భోగి పండుగ సందర్భంగా మెదక్ మండలం ముత్తాయి కుంట శివాలయాన్ని అదనపు కలెక్టర్ దర్శించుకున్నారు వేద పండితులు శివలింగం అభిషేకం నిర్వహించి ఆశీర్వచనం కల్పించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ ఆ పరమశివుని ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని హర హర మహాదేవ శంభో శంకర అనగానే బోలా శంకరుడు ఆ పరమశివుడని భక్తుల కోరిన కోరికలు తీరుస్తాడని పరమశివుని నిత్యం ఆరాధిస్తే మోక్షం సిద్ధిస్తుంది అన్నారు