ఘనంగా సంక్రాంతి వేడుకలు. టిటిడి కళ్యాణ మండపంలో సామూహిక నోములు

ఘనంగా సంక్రాంతి వేడుకలు.

టిటిడి కళ్యాణ మండపంలో సామూహిక నోములు

 

పెద్ద శంకరంపేట లోని టిటిడి కళ్యాణమండపంలో ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వేద బ్రాహ్మణ పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సామూహికంగా మహిళలు పంచ కళ్యాణాలు. బృందావనం. నోములు గాజుల బండి తదితర కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అత్యధిక ప్రసాదాలతో స్వామివారికి సమర్పించి ఒకరికొకరు సమర్పించుకున్నారు. సంక్రాంతి సందర్భంగా మహిళలు గృహాల వద్ద అందమైన రంగవల్లుu వేయడంతో పాటు చెరుకు గడలు కుసుమ కంకులు మొక్కజొన్న కంకులు తదితర వ్యవసాయ పంటల ను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్.ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు.రాగం అర్చన .చకిలం విశాల అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment