విఘ్నాలు తొలిగి విజయం వరించాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆధ్వర్యంలో గణపతి హోమం

విఘ్నాలు తొలిగి విజయం వరించాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆధ్వర్యంలో గణపతి హోమం

 

  నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్ ధర్నా సెంటర్ దగ్గర సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమ్మె 26వ రోజుకు చేరింది నేడు సమగ్ర ఉద్యోగులు తమకు ఉన్న విఘ్నాలు తొలిగి తాము అనుకున్న కార్యంలో విజయం సాధించాలని సమ్మె శిబిరంలో విజయ గణపతి,దుర్గ హోమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఉద్యోగ జాక్ గౌరవ అధ్యక్షులు నారాయణ, అధ్యక్షులు ఎల్లాగౌడ్ మాట్లాడుతూ గత 28 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు శాంతియుత సమ్మె కొనసాగిస్తూ ఉంటే కొందరు అధికారులు ఉద్యోగులకు ఫోన్ చేసి ఉద్యోగంలో చేరకుంటే మిమ్మల్ని ఉద్యోగంలోనుండి టెర్మినెట్ చేస్తాం అని అంటున్నారు మేము మా న్యాయమైన డిమాండ్ల నెరవేర్చాలని సమ్మె చేస్తున్నామని మా డిమాండ్ల పై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకుండా మమ్మల్ని ఇలా గందరగోళానికి గురిచేయడం అధికారుల తీరు మంచిది కాదని అధికారులు సమ్మెలో ఉన్న వారికి సహకరించి మా న్యాయమైన కోరికలు అమలు అయ్యేలా ప్రభుత్వం తో మా తరుపున మాట్లాడాలని కోరారు అలాగే ప్రభుత్వం ఉద్యోగుల తో చర్చించి మా డిమాండ్లను నెరవేరేలా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment