సోషల్ మీడియా ఇంచార్జి తల్లి లక్ష్మి పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ..పద్మా దేవేందర్ రెడ్డి
ఇటీవల హెర్నియా వ్యాధి బారినపడి చికిత్స చేయించుకున్న మెదక్ మండలం మక్తభూపతిపూర్ గ్రామానికి చెందిన ఎంబిపూర్ మహేష్ యాదవ్ తల్లి లక్ష్మి ని మెదక్ జిల్లా ఆసుపత్రిలో మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు,మాజీ ఎమ్మెల్యే యం.పద్మ దేవేందర్ రెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా చికిత్స చేసిన వైద్యులతో మాట్లాడి లక్ష్మి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. వీరి వెంట మెదక్ మున్సిపల్ తాజా మాజీ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ యం. లావణ్య రెడ్డి, మెదక్ మండల పార్టీ అధ్యక్షులు. యం.అంజాగౌడ్, పట్టణ పార్టీ సెక్రెటరీ జనరల్ గడ్డమీద కృష్ణ గౌడ్ ,తదితరులు పాల్గొన్నారు.