ఇల్లు దగ్ధమై మూడు రోజులు గడుస్తున్నా నిర్లక్ష్యం నీడలో అధికారులు
— భాజపా మండల అధ్యక్షులు
పంతులు హరీష్
సోమవారం కొల్చారం మండలం సంగాయిపేట గ్రామంలో నిరుపేద రైతు కుటుంబమైన నగరం నవాజ్ ఇల్లు ప్రమాదవశాత్తు షాట్ సర్క్యూట్ తో తగిలిపోవడం జరిగింది. సుమారు రెండు లక్ష వరకు ఆస్థి నష్టం జరిగింది. మూడు రోజులు గడుస్తున్న అయిన ఇప్పటివరకు ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కుడా అక్కడికి వెళ్లకుండా పంచనామ చేయకుండా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇట్టి విషయం భారతీయ జనతా పార్టీ విషయం దృష్టిలోకి రాగా మండల శాఖ ఆధ్వర్యంలో మండల శాఖ అధ్యక్షుడు ఘనపూర్ హరీష్ పరామర్శించడం, తన వంతుగా ఆర్థిక సాయం చేయడం జరిగింది. వారికి వెంటనే ఇళ్ళు మంజూరు చేసి వారిని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలి అని , స్పందించని అధికారుల మీద చర్య తీసుకో
వాలని భారతీయ జనతాపార్టీ కొల్చారం మండల శాఖ డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్య
క్రమంలో సంగాయి పేట బూత్ అధ్యక్షులు ఆంజనేయులు,బీజేపీ పార్టీనాయకులు,లింగం,గంగరాజ్,సాయి,శ్రీశైలం,వెంకట్,సాయిబాబా గౌడ్,పూల్ సింగ్, రమేష్, వెంకట
య్య మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు