అంగన్వాడీ కేంద్రంలో పిల్లలతో సరదాగా గడిపిన జిల్లా కలెక్టర్
–అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలను తమ సొంత పిల్లలుగా చూడాలి.
అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలను తమ సొంత పిల్లలుగా ఆదరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం బ్యాతోల్ గ్రామపంచాయతీ లోని అంగన్వాడి కేంద్రంమరియు ప్రాథమిక పాఠశాల గ్రామ పరిసరాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
.అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించి. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అంగన్వాడి కేంద్రాలు పనితీరుఆదర్శం అనిచెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భి ణీలు, బాలింతలు, ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకునేలా చూడాలని అన్నారు.పిల్లలతో కలెక్టర్ కాసేపు ముచ్చటించి వారికి అందిస్తున్న పౌష్టికాహారం ఆహారం వివరాలను తెలుసుకొని, చిన్నపిల్లలకు కలెక్టర్ స్వయంగా భోజనం వడ్డించి పిల్లలతో కలిసి ఆహారాన్ని తీసుకున్నారు. అంగన్వాడీ లోని పిల్లలతోకాసేపుసరదాగాగడిపారు.అంగన్వాడీ కేంద్రం ద్వారా వారికి నేర్పిస్తున్న విద్యాభోదనలు, రైమ్స్ కలెక్టర్ ఆలకించారు. ఈ సందర్బంగా పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించాలని కలెక్టర్ సూచించారు . ప్రాథమిక పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ స్వయంగా పాఠాలు బోధించి విద్యార్థిని విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు పాఠశాల పరిసర ప్రాంతాలను కలియ తిరిగి డ్రింకింగ్ వాటర్, కిచెన్ షెడ్, ఇతర సౌకర్యాలను పరిశీలించి సమర్థ నిర్వహణకు తగు సూచనలు చేశారు.గ్రామంలో పారిశుద్ధ్య పనుల పరిశీలనలో,పారిశుద్ధ్య పనులకు సంబంధించిన సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కారాలు సూచించడం జరుగుతుందన్నారు. కాలువల్లో ఎప్పటికప్పుడు చెత్తాచెదారం తొలగించాలి,, తీసిన చెత్తను డంపింగ్‌యార్డ్‌కు తరలించాలి, దోమల వ్యాప్తిని నివారించేలా ప్రజలకు అవగాహన కల్పించాలి, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు