గుండు బాలరాజు మృతి చెందడం బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు

గుండు బాలరాజు మృతి చెందడం బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు

 

— మెదక్ మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఏం పద్మ దేవేందర్ రెడ్డి

 

మెదక్ పట్టణం నవపేట కు చెందిన 

తెలంగాణ ఉద్యమకారుడు, బిఆర్

ఎస్ కార్యకర్త గుండు. బాలరాజు శనివారం మృతి చెందగా ఈ విష

యం మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లి

కార్జున్ గౌడ్ ద్వారా తెలుసుకున్న మెదక్ మాజీ ఎమ్మెల్యే యం. పద్మ

దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి.సుభా

ష్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు బట్టి. జగపతి, కృష్ణ రెడ్డి, లు శనివారం మెదక్ పట్టణంలోని నవపేట్ కు చేరుకొని బాలరాజు పార్థివ దేహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. బాలరాజు కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలరాజు మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు. బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు. 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో మాతోపాటు చురుకుగా పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు.పార్టీ పిలుపుమేరకు అన్ని కార్యక్రమంలో చురుకైన కార్యకర్తగా పనిచేశాడని గుర్తు చేశారు. బిఆర్ఎస్ పార్టీ పరంగా కార్యకర్త కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ఆధ్వర్యంలో మైనంపల్లి హామీ ఇచ్చారు. వీరి వెంట మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్,పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు,కౌన్సిలర్ లువిశ్వం,ఆర్కే. శ్రీనివాస్, జయరాజ్, శంకరంపేట్ ఆర్ మండల పార్టీ అధ్యక్షులు పట్లోరిరాజు,నాయకులులింగరెడ్డి,మోచి.కిషన్, శంకర్, సుమన్, మధు,కృష్ణ, గొండా స్వామి,నగేష్, గట్టేష్,రమేష్,రాజు కుమార్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment