లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్

 

లైన్స్ క్లబ్ వట్పల్లి శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో గలా హోప్ న్యూరో ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్. కృష్ణమూర్తి (న్యూరాలజిస్ట్) సౌజన్యంతో వట్పల్లి మండలకేంద్రం లో సీజన్1 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించునట్లు ఒక ప్రకటన మేనేజ్మెంట్ మొయినోద్దీన్, పెద్దన్న తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రా తేదీ 28-01-2025. సాయంత్రం ఐదు గంటలకు మ్యాచ్ ప్రారంభం తేదీ 29-01-2025. ప్రారంభం కానున్నాయి కాబట్టి ఆసక్తిగల క్రికెట్ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లైన్స్ క్లబ్ సభ్యులు కోరారు. నియమాలు నిబంధనలు ఎవరి కిట్టు వారే వెంట తేవలన్నారు. ప్రతి మ్యాచ్ 8 ఓవర్లు, ఎంపైర్ నిర్ణయమే తుది నిర్ణయం, ఒక టీం లో ఆడిన ఆటగాళ్లు మరొక టీంలో అడకూడదు, ప్రతి మ్యాచ్ కి మాన్ అఫ్ ది మ్యాచ్ ఇవ్వబడును, మ్యాన్ ఆఫ్ ది సీరియస్ గలదు, ఎంట్రీ ఫీజు 1500 చెల్లించిన జట్టు పేరు మాత్రమే డ్రా తీయబడును. క్రీడా స్పూర్తి తోడ్పడే విధంగా నియమాలు నిబంధనలు పాటించాల్సిందే అని పేర్కొన్నారు. మొదటి బహుమతి 30,111 రెండవ బహుమతి 20,111 వివరాలకై మొయినోద్దీన్, 9951863746 పెద్దన్న, 9490866326. వెంకట్ రావు 9000653499. నెంబర్లకు సంప్రదించాల్సిందిగా కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment