సీపీఎం రాష్ట్ర మహాసభల పోస్టర్ విడుదల
— పార్టీ రాష్ట్ర మహాసభల ను జయప్రదం చేయండి
….. జిల్లా కార్యదర్శి కె నర్సమ్మ
సీపీఎం పార్టీ రాష్ట్ర 4 వ మహాసభలను జయప్రదం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి కె నర్సమ్మ పిలుపు నిచ్చారు.శనివారం మెదక్ కేవల్ కిషన్ భవనం లో ఏ మల్లేశం అధ్యక్షతన జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ రాష్ట్ర 4 వ మహాసభల బహిరంగ సభ పోస్టర్ విడుదల చేశారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కె నర్సమ్మ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ మల్లేశం మాట్లాడుతూ సిపిఎం పార్టీ రాష్ట్ర నాలుగవ మహాసభలు జనవరి 25 నుంచి 28 వరకు సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో నాలుగు రోజులపాటు జరుగు తున్నాయన్నారు.గత మూడు సంవత్సరాలుగా చేసిన కార్మిక ప్రజా పోరాటాలు ఉద్యమాలను సమీక్షించే భవిష్యత్ కర్తలను రూపొందించడానికి మహాసభలు చర్చిస్తాయన్నారు జనవరి 25వ తేదీన భారీ బహిరంగ సభ సంగారెడ్డి ఐబి నుండి టి ఎస్ ఆర్ గార్డెన్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి వైఎస్ఆర్ గార్డెన్ లో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు ఈ మహాసభకు ఆల్ ఇండియా నాయకులు బృందాకార రాఘవులు కేరళ ముఖ్యమంత్రి పినరాయ విజయం త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కార్య దశ వర్గ సభ్యులు చుక్కా రాములు పార్టీ రాష్ట్ర నాయకత్వం అందరూ వి మహాసభలలో పాల్గొంటారన్నారు 25వ తేదీన జరిగే బహిరంగ సభకు జిల్లా నుండి కార్మిక రంగం రైతులు వ్యవసాయ కూలీలు పార్టీ శ్రేయోభిలాషులు సానుభూతిపరులు ప్రజలు అందరు కూడా బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కార్మిక సభ్యులు బసవరాజు బాలమణి కే మల్లేశం జిల్లా కమిటీ సభ్యులు నాగరాజు సంతోష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు