హైదరాబాద్ గచ్చిబౌలి ప్రిజం పబ్ లో కాల్పుల కలకలం
గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ లో కాల్పులు కలకలం రేపాయి. పోలీసులపై ఓ దొంగ కాల్పులు జరిపాడు. పబ్‌కు వచ్చిన దొంగను పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో దొంగ కాల్పులు జరపడంతో కానిస్టేబుల్ వెంకట్రెడ్డి, పబ్ లోని బౌన్సర్ కు గాయాలయ్యాయి. ఎట్టకేలకు దొంగను పోలీసులు అదుపులోకి తీసుకొని ఆరా తియగా నిందితుడు గతం లో విశాఖ సెంట్రల్ జైల్లో 100 కు పైగా చోరీ కేసుల్లో శిక్ష అనుభవించిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ గా గుర్తించారు తాజగా గచ్చిబౌలి పబ్ లో కాల్పుల ఘటనతో మళ్లీ అతడి పేరు తెరపైకి వచ్చింది అయితే ఈ ఘటన విషయం లో పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది