బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన
మహాత్మ గాంధీ చిత్రపటానికి వినతి పత్రం అందజేసిన నాయకులు
వట్పల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా బీర్ యస్ పార్టీ నాయకులు నివాళులు అర్పించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పిలుపు మేరకు జనవరి 30 నాటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 హామీల అమలులో పూర్తిగా విఫలమైందని గాంధీ గారి చిత్రపటానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వరం మాజీ చైర్మన్ వీరరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన 420 పూర్తి చేసుకున్న సందర్భంగా 420 హామీల వినతి పత్రాన్ని మహాత్మాగాంధీ చిత్రపటానికి అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మోసపూరిత అపద్దపు హామీలతో గద్దెనెక్కి ఇప్పుడు మోసం చేస్తుందని మండిపడ్డారు. అదేవిధంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు, మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లను పార్టీలకు అతీతంగా అమలు చేయాలనీ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధానకార్యదర్శి శివాజీ రావు, మాజీ ఎంపీటీసీలు బస్వరాజ్ పాటిల్, నర్సింలు, నాయకులు రాజు గౌడ్, కిషన్ రావు, విఠల్, ప్రకాష్ వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.