గంజాయి నిందితుల అరెస్ట్
సంగారెడ్డి ప్రోహిబిషన్&ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్. నవీన్ చంద్ర ఆదేశాలమేరుకు సోమవారం రోజన సాయంత్రం జిల్లా టాస్క్ ఫోర్స్ సంగారెడ్డి ఎక్సైజ్ సిబ్బంది ఇన్స్పెక్టర్ దుబ్బాక శంకర్ నేతృత్వములో జహీరాబాద్ మండలంలోని అల్గోల్ గ్రామం అల్లాన కంపెనీ దగ్గర వాహనాల తనిఖీ నిర్వహించగా అనుమానాస్పదంగా బైక్ పై ఎండు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న జహీరాబాద్ కి చెందిన ఇద్దరు వ్యక్తులు 1. ఎండి. సోఫియాన్ తండ్రి ఇమామ్, 2. ఎండి. రఫీ, తండ్రి గౌస్ లను అదుపు లోకి తీసుకొని వారి వద్ద నుండి 220 గ్రాముల ఎండు గంజాయిని ఒక మొబైల్ ఫోన్, బజాజ్ పల్సర్ బైక్ లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి జహీరాబాద్ ఎక్సైజ్ స్టేషన్ కి తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లు హనుమంతు, అనుదీప్ మరియు సిబ్బంది అరుణ్ జ్యోతి, అంజిరెడ్డి, రాజేష్, శివకాంత్ పాల్గొన్నారు.