మఖ్తల్ లో ప్రభుత్వ పారామెడికల్ మరియు నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలి ఏబీవీపీ నగర కార్యదర్శి వంశీ

మఖ్తల్ లో ప్రభుత్వ పారామెడికల్ మరియు నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలి ఏబీవీపీ నగర కార్యదర్శి వంశీ

 

 

మఖ్తల్ నియోజకవర్గ కేంద్ర పర్యటనకు విచ్చేసిన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నర్సింహ మఖ్తల్ ఏబీవీపీ సభ్యులు కలిసి మఖ్తల్ లో పారామెడికల్ కళాశాల మరియు నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందచేశారు సందర్భంగా నగర కార్యదర్శి వంశీ మాట్లాడుతూ 

తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా,ఆర్థికంగా,విద్యా వైద్యం, ఉద్యోగ పరంగా అన్ని విషయాల్లో వెనుకబడ్డ జిల్లాగా , వలస జిల్లాగా ఉమ్మడి పాలమూరు కానీ, నూతన నారాయణపేట జిల్లా కానీ అభివృద్ధికి నోచుకోలేదని అందులో మఖ్తల్ నియోజకవర్గం సరిహద్దు నియోజకవర్గం కావడంతో అన్ని రకాలుగా మరింత వెనకబడి ఉన్నదని తెలిపారు. నియోజకవర్గం అయినప్పటికీ కనీసం ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేని సందర్భంలో గతంలో అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ మఖ్తల్ శాఖ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసి మఖ్తల్ కు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సాధనలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఐతే ఇప్పటికీ ఆ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం కానీ డెవలప్మెంట్ కోసం బడ్జెట్ కానీ కేటాయించకపోవడం భాదాకరమని ఆ డిగ్రీ కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం సహకరించేలా చొరవ తీసుకోవాలని అన్నారు.

అయితే ప్రధానంగామఖ్తల్ మండల పరిసర గ్రామాల కుటుంబాలు అన్నీ కూడా ఆర్థిక వెనుకబాటు తనం వలన తమ పిల్లల చదువులను మధ్యలోనే ఆపివేయిస్తున్నారు. కనీసం వృత్తి విద్యాకోర్సు చదివి త్వరగా జీవితాల్లో స్థిరపడాలనే ఆలోచన ఉన్నప్పటికీ మఖ్తల్ కేంద్రంలో కానీ పరిధిలో కానీ ప్రభుత్వ నర్సింగ్ కాలేజి కానీ , కానీ పారామెడికల్ కాలేజి కానీ లేకపోవడం , ప్రైవేటు కళాశాలల ఫీజు కట్టే స్థోమత లేకపోవడంతో చదువు మధ్యలోనే ఆపివేయవడం జరుగుతున్నదని తద్వారా బాలికలకు మధ్యలోనే వివాహం చేయడం,బాలురులో ఉద్యోగవకశాల పట్ల నిరాసక్తత ఏర్పడుతున్నదని కావున మఖ్తల్ మండల , పరిసర మండల గ్రామాల వారికీ అందుబాటులో ఉన్న మఖ్తల్ కేంద్రంగా ప్రభుత్వ పారామెడికల్ మరియు నర్సింగ్ కళాశాలను మంజరు చేయలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మఖ్తల్ శాఖ తరపున కోరుతున్నామని ఈ విషయంలో వీలైనంత త్వరలో పారమెడికల్ , నర్సింగ్ కళాశాలలను మంజూరు చేయాలని కోరారు కార్యక్రమంలో ఏబీవీపీ నగర కార్యదర్శి వంశీ,వినయ్,అరవింద్,సందీప్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment