బిజెపి బిఆర్ఎస్ కుమ్మక్కు తోనే కవితకు బెయిల్…
చార్మినార్ ఎక్స్ ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో ఆగస్టు 27 ప్రతినిధి
కేటీఆర్, హరీష్ రావు బిజెపి నేతల చుట్టూ తిరిగి కవితకు బెయిల్ తెప్పించు కున్నారని మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ ఆరోపించారు బిజెపి ,బీఆర్ఎస్ కుమ్మక్కు వల్లే ఇది సాధ్యమైందన్నారు ఈ బెయిల్ తో బిజెపిలో టిఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలైందని దీన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు అధికార పార్టీ కాంగ్రెస్ , సీఎం రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకే బిజెపి, బీఆర్ఎస్ ఒకటవుతున్నాయని ఆయన మండిపడ్డారు