స్వచ్ఛతనం పచ్చదనం పై అవగాహన ర్యాలీ.
తాసిల్దార్ గ్రేసీ బాయ్.
- చార్మినార్ ఎక్స్ ప్రెస్: ఆగస్టు 5 .పెద్ద శంకరంపేట్. స్వచ్ఛదనం పచ్చదనంపై సోమవారం నాడు తాసిల్దార్ గ్రేసి బాయ్ విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. పెద్ద శంకరంపేట్ మండలంలో ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని, ప్లాస్టిక్ వాడకం నిషేధం, తడి, పొడి ,చెత్త వేరు చేయడం గురించి అవగాహన ర్యాలీ నిర్వహించారు. పేట పి హెచ్ సి లో అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు స్వచ్ఛ ధనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో వెంకట రాములు ప్రభుత్వ ఉపాధ్యాయులు ,అంగన్వాడి టీచర్లు సరళ, సుజాత, స్వరూప సుక్కమ్మ పి హెచ్ సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.