ఇండ్లు కాలిపోయిన కుటుంబాలకు చేయూతనిచ్చిన ఎటపాక మండల వైఎస్సార్ సీపీ నాయకులు
ఎటపాక మండలం నల్లకుంట పంచాయతీలోఊయిక ఇరమయ్య, తెల్లం రాములమ్మ లు నివాసం ఉంటున్న ఇల్లు నిన్న సాయంత్రం పూర్తిగా అగ్నికి ఆహుతి అవ్వడం జరిగింది. కళ్ళ ముందు ఇల్లు కాలిపోవడంతో చేసేదేమీ లేక నిరాశ్రయులై కట్టుబట్టలతో బయటకు రావడం జరిగింది. విషయం తెలుసుకున్న ఎటపాక మండల వైఎస్ఆర్సిపి నాయకులు స్పందించి ఎమ్మెల్సీ అనంత బాబు మరియు మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి దృష్టికి తీసుకెళ్లి వారి సహాయ సహకారాలతో, ఎటపాక మండల వైఎస్ఆర్సిపి నేతృత్వంలో ఇల్లు కాలిపోయిన నిరుపేద కుటుంబాలకు బియ్యం,, నిత్యవసర సరుకులు, మరియు నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకట రామారావు ( పెద్దోడు), రాష్ట్ర కార్యదర్శి, కురినాల వెంకటేశ్వర్లు ( బుజ్జి) గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి, గుండాల ఉపసర్పంచ్ తోట శశి కుమార్, మండల యువజన నాయకుడు ముత్తిపోయిన రాము,ధార రవి కోడూరి నవీన్ ధారా రమేష్,కురసం రాజశేఖర్ తెల్లం నారాయణ, సర్పంచ్ తెల్లం రావులమ్మ తదితరులు పాల్గొన్నారు.