శ్రీ కనకదుర్గ దేవాలయంలో జీవ ధ్వజ పూజలు

శ్రీ కనకదుర్గ దేవాలయంలో జీవ ధ్వజ పూజలు

 

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నూతన వ్యవసాయ మార్కెట్లో వేంచేసియున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో జీవద్వజ ప్రతిష్ట మహోత్సవాలు రెండవ రోజు ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వేద పండితులు ఇరువంటి వెంకటరమణ శర్మ, సత్యనారాయణ శర్మ, కిషోర్ శర్మ శిష్య బృందంతో గణపతి పూజ, పుణ్యాహవాచనం, గోపూజ, అగ్నిప్రతిష్ట, వాస్తు హోమము, మూల మంత్ర అనుష్టానం, చండి పారాయణం, రుద్రహోమం, నిర్వహించారు.నూతన ద్వజం కు జలాధివాసం, ధాన్యాదివాసం,షయ్యదివాసం నిర్వహించారు.అంతకు ముందు మహిళలు పెద్ద ఎత్తున అంబేద్కర్ నగర్ లోని రామాలయం నుండి కనకదుర్గ గుడి వరకు కలశాలతో శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు ఇల్లందుల చంద్రశేఖర్ శర్మ, ఆలయ అధ్యక్షులు ఉప్పల సత్యనారాయణ కార్యదర్శి మిర్యాల కొండలరావు కోశాధికారి ముప్పారపు బాబురావు, టీవీ సాగర్ ముప్పారపు నాగేశ్వరరావు, బజ్జూరి శ్రీనివాస్, చల్లా సత్యనారాయణ, మాడుగుల నవీన్ కుమార్, పాలవరపు శ్రీనివాస్, ఇమ్మడి శెట్టి అయ్యప్ప , నోముల శ్రవణ్ కుమార్ వీరబోయిన వెంకటేశ్వర్లు కూతురు శ్రీనివాస్, పోశం వెంకటేశ్వర్లు మహేందర్,కక్కిరేణి చంద్రశేఖర్ కర్నాటి నాగేశ్వరరావు,బోనాల నాగరాజు, వెన్న సురేష్,శ్రీరంగం శ్రీనివాస్, మోషేట్టి. శ్రీనివాస్,గొట్టిముక్కుల రవికుమార్,బూడిద శ్రీశైలం,బజ్జూరి దయాకర్, పైడిమర్రి రమేష్, మొరిశెట్టి వెంకటేశ్వర్లు,కందిమల్ల సత్యనారాయణ, రంగినేని మాధవరావు,చల్ల వెంకన్న,కోమల్లపల్లి శ్రీనివాస్,ఈగ సంపత్,వనమా శ్రీనివాస్,బాంబుల శరత్ సింగ్,గజ్జి కృష్ణయ్య,మెంతబోయిన లింగరాజు,గుండా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment