సూర్యాపేటలో పరువు హత్య
ఆరుగురు నేరస్తుల అరెస్టు
ప్రేమ వివాహమె హత్యకు కారణం
యస్పీ సన్ ప్రీత్ సింగ్
కుల దురహంకారంతో పథకం ప్రకారo వడ్లకొండ కృష్ణ ను హత్య చేసిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. హత్య కేసుపై బుధవారం స్థానిక యస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ వివరాలు వెల్లడించారు.హత్యకు గురైన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటి కృష్ణ, పిల్లలమర్రి గ్రామానికి చెందిన కోట్ల నవీన్ ల మద్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది.దీంతో కృష్ణ తరచూ నవిన్ ఇంటికి వెళ్ళేవాడు. ఈ క్రమములో నవీన్ చెల్లెలు భార్గవి, బంటి ప్రేమించుకున్నారు. భార్గవి కుటుంబ సబ్యులు వీరి ప్రేమను అంగీకరించలేదు. దీంతో ఇరువురు కుటుంబ సబ్యులకు తెలియకుండా వివాహము చేసుకున్నారు. ఇది భార్గవి కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు.దీంతో వారు కృష్ణను అంతం చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు.ఇందులో భాగంగా తాళ్లగడ్డకు చెందిన బైరు మహేశ్ తో పాటు నల్గొండకు చెందిన మరో యువకుడు నువ్వుల సాయి చరణ్ సాయం తీసుకున్నారు.ప్లాన్ లో భాగంగానే కొన్నాళ్లుగా కృష్ణతో నిందితుడు బైరు మహేశ్ స్నేహం చేస్తున్నట్లు నటించాడు. ఈ పథకాన్ని ఈ నెల 19వ తేదీన అమలు చేయాలని చూసినప్పటికీ సాధ్యం కాలేదు. మరోసారి ప్రయత్నించి విఫలం అయ్యారు.ఈ క్రమంలో ఈ నెల 26 న ఆదివారం రాత్రి హత్యకు పాల్పడ్డారు. ఇందుకు గాను 26 వతేదీ సుమారు 4.40 గంటల సమయములో మహేశ్ అనే నింధితుడు హత్యకు గురైన కృష్ణ కు ఫోన్ చేసి చేసి పని ఉన్నది రమ్మని చెప్పినాడు. బంటి వస్తున్నాను అని చెప్పగానే, పథకం ప్రకారం మహేశ్ వెంటనే నవీన్ కు ఫోన్ చేసి మేము వస్తున్నం, అలర్ట్ గా ఉండమని చెప్పినాడు. బంటి తన స్కూటి పై మహేశ్ ఇంటి ముందుకు రాగా మహేశ్ బంటి స్కూటి ఎక్కి ఇద్దరు పార్టీకి కావాల్సిన డ్రింక్స్, తినుబండారాలు కొనుక్కొని సూర్యాపేటలోని జనగామ క్రాస్రోడ్డు సమీపం లోని మహేశ్ వ్యవసాయ భూమి వద్ద కు చేరుకున్నారు. మహేశ్ మద్యం తాగగా, కృష్ణ కూల్ డ్రింక్ తాగాడు. ఆ రోజు సాయంత్రం అక్కడ సుమారు 3-4 గంటల సేపు కూర్చున్నారు. మహేశ్ కొద్ది దూరము వెళ్ళి నవీన్ కు ఫోన్ చేసి, నేను బంటి మెడ అందుకోగానే వారిని రమ్మని చెప్పినాడు.ఇంటికి వెళ్లుదామని బంటి స్కూటర్ స్టార్ట్ చేయగా, మహేశ్ స్కూటర్ వెనకాల ఎక్కి కూర్చున్నాడు.బంటి స్కూటర్ కదిలిస్తుండగా మహేశ్ బంటి మెడకు చుట్టూ చేయి వేసి గొంతు నొక్కి గట్టిగా పట్టుకున్నాడు. అప్పటికే అక్కడ కంప్లచెట్లలో దాక్కున్న నవీన్, వంశీలు పరిగెత్తుకుంటూ వచ్చారు.వెంటనే బంటి కాళ్ళు వంశీ పట్టుకోగా, నవీన్ కూడా బంటి గొంతు పట్టికొని వత్తినాడు. కొట్టి చనిపోయినాడని నిర్ధారించుకున్న తరువాత నవీన్ తన ఎర్టీగ కారులో ఉన్న ఒక ప్లాస్టిక్ పెద్ద బస్తా లో బంటి శవాన్ని వేసి, తాడుతో మూట కట్టి, కారు వెనుక డిక్కీలో వేశారు. నవీన్, వంశీలు బంటి శవాన్ని పాత సూర్యాపేట లో బంధువుల ఇంటిలో ఉన్న తమ నాయనమ్మ బుచ్చమ్మ కు చూయించారు.అక్కడి నుంచి నల్గొండలో ఉన్న తన ఫ్రెండ్ సాయి చరణ్ వద్దకు వెళ్ళి శవాన్ని చూపెట్టేందుకు కారులో వెళ్లారు. చరణ్ ను కారు వద్దకు తీసుకొని వచ్చి బంటి శవము మూటను చూపించారు. వెంటనే చరణ్ భయంతో కారు దిగి వెళ్ళినాడు. అక్కడి నుండి వారు కారులో తిరిగి సూర్యాపేటకు వెళ్లే దారిలో పాత సూర్యాపేటకు వెళ్ళి నాయనమ్మ కోట్ల బుచ్చమ్మను, వంశిని లేపారు. బంటి స్కూటటర్ వంశీ తీసుకొని కారు వెనుక నుండి రాగా మళ్ళీ పిల్లలమర్రి గ్రామ శివారులో గల చెర్వు కట్ట చివరలో మూసి కెనాల్ ప్రక్కన బంటి మృతదేహాని పడేశారు.అనంతరం వారు అక్కడి నుండి పాత సూర్యాపేటకు వెళ్ళి అక్కడ కోట్ల బుచ్చమ్మ ఉన్న వారి బందువు ఇంట్లో ముగ్గురు పడుకున్నారు. తరువాత అక్కడి నుండి కారులో మహేష్, నవిన్, వంశీలు హైద్రాబాద్ కు వెళ్ళి అక్కడ ఉండి 28 వ తేది రాత్రి పిల్లలమర్రిలోని నవీన్ ఇంటికి రావడం జరిగింది. సమాచారం అందుకొని బుధవారం ఉదయము పోలీస్ లు వారిని అరెస్టు చేశారు.వీరి నుండి హత్యకు ఉపయోగించిన ఎర్టీగా కారు, ఒక కత్తి, 5 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు.వీరిపై ఎస్సి,ఎస్టీ యట్రాసిటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. నింధితుల గత నేర చరిత్ర ఉంది.ఇందులో కోట్ల నవీన్ సూర్యాపేట రూరల్ పిఎస్ పరిధిలో నాలుగు పాత కేసులలో ముద్దాయి గా ఉన్నాడు. అదేవిధంగా బైరు మహేశ్ టౌన్ పిఎస్ పరిధిలో తొమ్మిది పాత కేసులలో ముద్దాయి గా ఉన్నాడు.అదేవిధంగా టౌన్ పి.యస్ యందు రౌడీ షీట్ వుంది. కోట్ల సైదులు సూర్యాపేట రూరల్ పిఎస్ పరిధిలో ఒక పాత కేసులో ముద్దాయి గా ఉన్నాడు.
కోట్ల వంశి సూర్యాపేట రూరల్ పిఎస్ పరిధిలో మూడు పాత కేసులలో ముద్దాయి గా ఉన్నాడు.కోట్ల బుచ్చమ్మ కు సూర్యాపేట రూరల్ పిఎస్ పరిధిలో రెండు పాత కేసులలో ముద్దాయి గా ఉన్నది.
నువ్వుల సాయిచరణ్ నల్లగొండ II టౌన్ పిఎస్ పరిధిలో ఒక పాత కేసులో ముద్దాయి గా ఉన్నాడు.ఇక హత్యకు గురైన కృష్ణ పై కూడా 3 కేసులు ఉన్నాయి. కులాంతర వివాహం నేపథ్యంలో ఇరు కుటుంభాలకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని యస్పీ తెలిపారు. అమ్మాయి తరుపు కుటుంబ సబ్యులు మనసులో పెట్టుకుని ప్లాన్ ప్రకారం హత్యచేశారని పేర్కొన్నారు. సోదరులైన కోట్ల నవీన్, వంశీ లు స్నేహితుడైన బైరు మహేష్ తో కలిసి హత్య కు పాల్పడ్డారని చెప్పారు. అమ్మాయి సోదరులైన కోట్ల నవీన్, వంశీ, తండ్రి సైదులు, నాయనమ్మ బుచ్చమ్మ, స్నేహితుడైన మహేష్, సాయి చరణ్ లను అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. హత్యలో ఇంకా ఎవరైనా ఉంటే దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు. ఇలాంటి వాటికి ఎవ్వరూ పాల్పడవద్దని ప్రేమ వివాహాలు, కులాంతర వివాహాల చేసుకుంటే పోలీసు వద్దకు రావాలని సూచించారు.ఇబ్బంది పెట్టె వారు ఉంటే పోలీసులకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి చర్యల వల్ల జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఎస్పి అన్నారు.ఈ సమావేశంలో డిఎస్పీ రవి,సిఐ రాజశేఖర్, యసై బాలు నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.